జ్యోతిషం శాస్త్రం లోశరీరంలో ఏ భాగం పై బల్లి పడితే ఏమవుతుందనే శకునాలను మనం నమ్ముతూ వస్తున్నాం.
జ్యోతిషంలో శాస్త్రం బల్లి పడితే శకునాల ప్రభావం గురించి వివరించారు. జ్యోతిషం శాస్త్రంలో కొన్నిసార్లు బల్లి మీద పడితే మంచి శకునంగానూ కొన్ని సార్లు అశుభంగానూ భావిస్తారు.
మహిళకు శరీరంలోని ఎడమ భాగంపై పురుషుడి శరీరంలోని కుడి భాగంపై బల్లి పడితే శుభాలు కలుగుతాయని చెబుతారు.
మహిళకు కుడి భాగంపై, పురుషుడి ఎడమ భాగంపైన బల్లి పడితే అశుభాలు కలుగుతాయని విశ్వసిస్తారు.
పురుషుడి తలపై బల్లి పడితే వివాదాలు ముసురుకుంటాయనే సంకేతం . మహిళకు తల పైభాగాన పడితే మరణ భయం. రెండు పెదవుల మీద పడితే ఒకరి మరణవార్త వింటారు.
నుదుటి మీద పడితే ప్రేమికుల నుంచి దూరమవుతారు. కింది పెదవి మీద పడితే త్వరలో ఆర్థిక లాభం చేకూరుతుంది. మహిళకు ఎడమ కంటిపై పడితే శుభవార్త వింటారు.
పై పెదవి మీద పడితే తగువులు వస్తాయి.మహిళకు కుడి కంటి మీద పడితే మీరు చేపట్టిన పని కాదు. మహిళకు ముఖం మీద పడితే ఊహించని విధంగా సంపద వచ్చి పడుతుంది.
పురుషుడి నోటి మీద మీ ఆరోగ్యం నశిస్తుందని అర్థం. పురుషుడి వీపు వెనక భాగంలో పడితే విజయం లభిస్తుంది. పురుషుడి మణికట్టుపై పడితే వివాదాలు ముసురుకుంటాయనే సంకేతం.
మహిళకు కుడి చేయి మీద బల్లి పడితే ఆర్థిక నష్టం వాటిల్లుతుంది. పురుషుడి వేళ్ల మీద పడితే పాత మిత్రులు కలుస్తారు. పురుషుడి కుడి చేతి మీద పడితే కష్టాలు వస్తాయనే సంకేతం. మహిళకు ఎడమ చేతి మీద పడితే అవమానం జరుగుతుంది. మహిళకు కుడి చేయి తొడల మీద పడితే పడితే శుభవార్త వింటారు. పురుషుడి మీసాల మీద పడితే పడితే వివాదాలు ముసురుకుంటాయనే సంకేతం