పుదీనా ఆకులను టీతో కలిపి తాగితే రుచుగా ఉండడామే కాక కంఠస్వరం బాగుంటుంది. గాయకులు, డబ్బింగ్ చెప్పేవారు పుదీనా రసం తాగితే కంఠస్వరం మృధువుగా మధురంగా తయారవుతుంది. ఇవే కాక, ఆహార పదార్ధాల తయారీలో, కాస్మోటిక్స కంపెనీల్లో, బబుల్ గమ్స్ తయారీలో, మందుల్లో, మరి కొన్ని ఉత్పత్తులో ఈ పుదీనా వాడకం ఎంతో ఉంది.
క్రిమి సంహారక గుణాలు కూడా ఇందులో పుష్కళంగా ఉన్నాయి. కనుకనే, దీనిని అఫ్గ్‌నిస్ధాన్ ప్రజలు అత్యధికంగా వాడుతున్నారు. అంతేకాక అక్కడ ఇళ్ళలో కూడా దీనిని విస్తారంగా పెంచుతారు. గ్రీకు, సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా, మొదలైన దేశాలలో కూడా దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది.
సిగరెట్ తయారీ కంపెనీలలో కూడా దీనిని వినియోగించి మెంథాల్ సిగరెట్లు తయారు చేస్తున్నారు. సిగరెట్ అలవాటు ఉన్నవారికి కొంత వరకూ గొంతు సమస్యలు అరికడుతుంది కనుక దీనికి మరింత ప్రాముఖ్యత ఏర్పడింది.
సబ్బుల తయారీలో కూడా వాడుతున్నారు. పుదీనా ఫ్లేవర్‌తో తయారైన ఏ ప్రొడక్టకైనా ప్రపంచవ్యాప్తంగా వినియోగం అధిక సంఖ్యలో ఉందనడం అతిశయోక్తికాదు. దీనిలో కేలరీలు ఏమీ లేకపోడంతో అందరూ పుదీనాని ఎంతైనా వినియోగించుకోవచ్చు. ఇంతటి విలువలు ఉన్న పుదీనాని ప్రతి వారు ఇంట్లో పెంచి తాజాగా వాడుకుంటూ వుండడం ఎంతైనా శ్రేయస్కరం. మనం రోజు పుదిన అహరాంగ తింతె ఎంతో మంచిది.
ఇది చిన్న కుండీలలో కూడా పెరగగల మొక్క. కనుక స్థలాభావం దీనికి ఉండదు. పెంపకానికి ఎంతో అనువుగా ఉంటుంది.